భర్త అదృశ్యం.. కేసు నమోదు

భర్త అదృశ్యం.. కేసు నమోదు

నెల్లూరు జిల్లాలోని మన్సూర్ నగర్‌కు చెందిన బషీర్ అహ్మద్ అనే వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే అతను 9 నెలలుగా ఇంటికి రాకుండా బెంగళూరులోనే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అతని భార్య మొబీనా సోమవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.