రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్సైలు.!

రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్సైలు.!

HYD: ఎల్‌బీ‌నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్‌లను ఏసీబీ అధికారులు రూ.1 లక్ష లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ చేయకుండా, BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇస్తామని చెప్పి ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వెల్లడించింది.