చెక్‌పోస్టుల పరిశీలన చేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్

చెక్‌పోస్టుల పరిశీలన చేసిన డీసీపీ రాజమహేంద్ర నాయక్

WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ బుధవారం పట్టణంలోని పోలింగ్ కేంద్రాలు, చెక్‌పోస్టులను సందర్శించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు పోలీస్ బలగాలు మోహరించాలని, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. నగదు, మద్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.