నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
MHBD: తొర్రూరు బార్ అసోసియేషన్‌కు 2026- 27 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జూనియర్ సివిల్ జడ్జి దామెర ధీరజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా వీరదాసు వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా తొనుకునూరి సైదులు సహా ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అంబేద్కర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.