ఇంటర్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
PPM: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని కలెక్టర్ ప్రభాకర రెడ్డి వెల్లడించారు. శనివారం సీతానగరం మండలం జోగింపేటలోని ఏపి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులను స్వయంగా పరిశీలించారు.