కత్తితో బెదిరించి రూ.40 లక్షలు దోచుకెళ్లారు!

కత్తితో బెదిరించి రూ.40 లక్షలు దోచుకెళ్లారు!

HYD: నగరంలోని భవానీ నగర్ పీఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది. సుల్తాన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దుండగులు, కత్తితో బెదిరించి రూ.40 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.