గర్భిణీ స్త్రీలను 10 రోజుల ముందే ఆసుపత్రులకు తరలించాలి

గర్భిణీ స్త్రీలను 10 రోజుల ముందే ఆసుపత్రులకు తరలించాలి

MDK: భారీ వర్షాలు కురుస్తున్నందున గర్భిణీ స్త్రీలను 10 రోజుల ముందే సమీప ఆసుపత్రులకు తరలించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీ రామ్ ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. గురువారం పెద్ద శంకరంపేట పీహెచ్సీ ని సందర్శించి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, ల్యాబ్, ఫార్మసీలను తనిఖీ చేసి, లేబర్ రూమ్ సిద్ధంగా ఉండాలని సూచించారు.