'భవిష్యత్తు వైద్యులు బాధ్యతగా నడుచుకోవాలి'

'భవిష్యత్తు వైద్యులు బాధ్యతగా నడుచుకోవాలి'

MBNR: భవిష్యత్తు వైద్యులు బాధ్యతగా నడుచుకోవాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు,వారి తల్లిదండ్రుల ఓరియంటేషన్ కార్యక్రమానికి ఎస్పీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహపూర్వక వాతావరణంపై ఎల్లవేళలా దృష్టి సాధించాలన్నారు.