హోలీ వేడుకలపై ఎస్పీ కీలక సూచనలు
NGKL: నాగర్ కర్నూల్ జిల్లాలో హోలీ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ కోరారు. రసాయన రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులు వాడాలని, చెరువులు, బావుల వద్ద ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా పండుగ జరుపుకోవాలని ఎస్పీ తెలిపారు.