విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ
ELR: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు సోమవారం వినియోగదారులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ సత్యనారాయణ మాట్లాడుతూ.. మహోద్యమంగా ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు కొనసాగించాలన్నారు. ఇంధనం పొదుపు చేద్దాం, భావితరాలకు వెలుగునిద్దాం అనే బాధ్యత ప్రతి ఒక్కరూ అమలు చేయాలని సూచించారు.