ప్రశాంతంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

ప్రశాంతంగా మూడో దశ నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

JGL: ధర్మపురి నియోజకవర్గంలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ మూడో రోజు శాంతియుత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నాటికి సర్పంచ్ స్థానాలకు 873, వార్డు మెంబర్ స్థానాలకు 2,639 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.