అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న కలప పట్టివేత

MNCL: అక్రమంగా కలపను తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నామని తాళ్ల పేట FRO సుష్మ రావు తెలిపారు. దండెపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి బైక్‌పై కలపను తరలిస్తుండగా రాత్రి వెంబడించి పట్టుకున్నామన్నారు. కలపను తరలించడం నేరమని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆకస్మిక దాడిలో FBOలు సాయి, రహీముద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.