మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి: CPI
NDL: నందికొట్కూరు నియోజకవర్గంలో మొక్కజొన్న పంటను సాగు చేసుకుని రైతులు తీవ్రంగా నష్టపోయారని CPI నాయకుడు గిరీష్, షేక్షావలి అన్నారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో CPI నాయకులు పాల్గొన్నారు. మొక్కజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. ఎకరాకు 30 వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.