నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
MBNR: దేవరకద్ర నియోజకవర్గంలో నేడు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పర్యటించనున్నారు. భూత్పూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి, జనరల్ బాడీ సమావేశంలో పాల్గొంటారు. అనంతరం దేవరకద్ర తహశీల్దార్ కార్యాలయంలో కౌకుంట్ల మండల లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.