వరి పొలంలో జారిపడి రైతు మృతి
SDPT: చేర్యాల మండలం వీరన్న పేట గ్రామంలో పోకల రాజు (45) అనే రైతు వ్యవసాయ బావి వద్ద వరి పొలాన్ని పరిశీలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గట్టుపై నుంచి పొలంలో జారిపడి ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న చేర్యాల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.