VIDEO: తప్పని డోలి మోత కష్టాలు
AP: రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆయా గ్రామాల్లోని ప్రజలకు డోలి మోత కష్టాలు తప్పడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రెబ్బ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలిని నాగావళి నది మీదుగా డోలిలో ఆస్పత్రికి మోసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.