ఆసుపత్రిలో ఉచిత ఎక్స్-రే, స్కానింగ్ శిబిరం

ఆసుపత్రిలో ఉచిత ఎక్స్-రే, స్కానింగ్ శిబిరం

ADB: నార్నూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవాళ ఉచిత ఎక్స్-రే, స్కానింగ్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని డాక్టర్ జితేందర్ రెడ్డి సూచించారు.