19న రాజమండ్రిలో ఉగాది పురస్కార మహోత్సవం
E.G: రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని కవులు, పండితులు, కళాకారులను సముచిత రీతిలో గౌరవించేందుకు 'ఉగాది పురస్కార మహోత్సవం' మార్చి 19న నిర్వహించనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మంగళవారం తెలిపారు. ఈ మహోత్సవం నగరంలోని జె.కె. గార్డెన్స్ వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రతిభావంతులైన కవులు, పండితులు, కళాకారులను సన్మానిస్తామన్నారు.