ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన కలెక్టర్

ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని ప్రారంభించిన కలెక్టర్

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏజెన్సీ కోర్టు సముదాయాన్ని కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్‌తో గురువారం ప్రారంభించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రికార్డు గది, కంప్యూటర్ గది, వివిధ విభాగాలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, న్యాయవాదులు తదితరులు ఉన్నారు.