BRSలోకి చేరిన కాంగ్రెస్ నేతలు
RR: షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో ఎలికట్ట కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున BRSలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో BRS ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, తెలంగాణ ప్రాంతానికి మంచి రోజులు రానున్నాయన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.