15 ఏళ్ల పాటు అధికారం కూటమిదే: ఎమ్మెల్యే
W.G: కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉంటుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. పాలూరులో పలు అభివృద్ధి పనుల్లో పాల్గన్న అనంతరం మాట్లాడారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. మద్యం రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరిపై సిట్ విచారణకు, కూటమికి ఏం సంబంధమని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు చట్టానికి సమాధానం చెప్పక తప్పదన్నారు.