17న పెన్షనర్ల సమస్యలపై నిరసన
KDP: ఈ నెల 17వ తేదీన పులివెందుల ఆర్డీవో కార్యాలయం ఎదుట పెన్షనర్ల సమస్యలపై నిరసన చేపడుతున్నామని ఏపీ పెన్షనర్ల అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం పులివెందులలో మాట్లాడుతూ, గత 10 ఏళ్లుగా హైయర్ పెన్షన్ కోసం పోరాడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధాకరమన్నారు.