RTC బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

RTC బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

ప్రకాశం: పెద్దారవీడు మండలంలో శుక్రవారం RTC బస్సు బోల్తా పడింది. నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు పెద్దారవీడు మండలం మద్దలకట్ట గ్రామ సమీపంలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.