బోగోలులో ముగిసిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రితో ఘనంగా ముగిశాయి. గత నెల 26 నుంచి మార్చి 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామివారు ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు ఉదయం 10 గంటలకు హుండీ లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు.