తరం మారిన విద్య విలువ మారదు: ఎమ్మెల్యే

NGKL: తరం మారిన విద్య విలువ మారదని,ప్రతి విద్యార్థి విజ్ఞానార్జనతో ముందుకుసాగాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలను శనివారం ఎమ్మెల్యే సందర్శించి, ఫౌండేషన్ ద్వారా 15గ్రీన్ బోర్డులను కళాశాలకు అందజేశారు. విద్యాభివృద్ధికి ప్రజా ప్రభుత్వంలో అధిక ప్రాధాన్యత కల్పిస్తూ అందిస్తున్న మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.