PACS కార్యదర్శిగా బాబురావు

PACS కార్యదర్శిగా బాబురావు

KMR: డోంగ్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యదర్శిగా బిరాదర్ బాబురావు ఇవాళ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. జుక్కల్ సహకార సంఘం నుంచి బదిలీపై వచ్చిన ఆయనను PACS ఛైర్మన్ రాంపటేల్, పాలకవర్గం, సిబ్బంది ఘనంగా సన్మానించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని బాబురావు ఈ సందర్భంగా తెలిపారు. ఏవో శివకుమార్, ఎన్‌డీసీసీబీ మేనేజర్, తదితరులు పాల్గొన్నారు.