బాలిక ఆత్మహత్య.. మంత్రి వాసంశెట్టి పరామర్శ

బాలిక ఆత్మహత్య.. మంత్రి వాసంశెట్టి పరామర్శ

AP: కోనసీమ జిల్లాలో ఐదో తరగతి విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆ బాలిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. ఈ క్రమంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ బాధిత బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు. బాలిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.