అమెరికాలో కూలిన F-35 ఫైటర్ జెట్

అమెరికాలో కూలిన F-35 ఫైటర్ జెట్

అమెరికాలో అత్యంత శక్తివంతమైన F-35 ఫైటర్ జెట్ కుప్పకూలింది. లాస్ వేగాస్ సమీపంలోని నెవాడ టెస్ట్ అండ్ ట్రైనింగ్ రేంజి పరిధిలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉండగా విమానం అదుపుతప్పి కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పైలట్ పారాచూట్ సహాయంతో ఎగిరిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయని అమెరికా ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.