గుంటూరు మెడికల్ కాలేజ్ సూచన

GNTR: పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 27వ తేదీ వరకు గడవును పొడిగించామని గుంటూరు ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి తెలిపారు. గతంలో ప్రకటించిన 16వ తేదీ కౌన్సెలింగ్‌ను రద్దు చేశామని చెప్పారు. అక్టోబర్ 9వ తేదీ వరకు కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలను apsahpc.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.