చిట్యాలలో రూ. 231.46 లక్షల పన్ను వసూలు
NLG: చిట్యాల మున్సిపాలిటీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను వసూళ్ల వివరాలను ఇంఛార్జ్ కమిషనర్ రంజిత్ కుమార్ వెల్లడించారు. మొత్తం 3,801 అసెస్‌మెంట్ల ద్వారా రూ. 231.46 లక్షల పన్ను వసూలు కావలసి ఉండగా, మార్చి 31 నాటికి రూ. 118.82 లక్షలు వసూలైంది. అంటే దాదాపు 51.34 శాతం పన్ను వసూలు పూర్తయిందని ఆయన తెలిపారు. ఇంకా రూ. 112.64 లక్షల బకాయిలు రావాల్సి ఉంది.