VIDEO: పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత
ELR: నూజివీడు పట్టణంలోని పలు ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ కె.పీరయ్య సోమవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయా వార్డులలో డ్రైనేజీల పరిశుభ్రత, పిచ్చి మొక్కల తొలగింపులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. నూజివీడు పట్టణం క్లీన్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉండేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని సూచించారు.