'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోండి'
MBNR: ప్రభుత్వ ఆదేశాల మేరకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించడం జరిగిందని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు ఒక ప్రకటన ద్వారా వెలడించారు. జిల్లాలో అర్హత కలిగిన విద్యార్థులు విదేశాలలో చదువుకునేందుకు స్కాలర్షిప్ రిజిస్ట్రేషన్ సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.