పక్కాగా ఓటర్ జాబితా రూపొందించాలి: కలెక్టర్
SRPT: మున్సిపాలిటీల్లో ముసాయిదా ఓటర్ జాబితాపై వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 10న వార్డుల వారీగా మున్సిపల్ తుది ఓటర్ జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.