'అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ అందాలి'

'అర్హులందరికీ ‘అన్నదాత సుఖీభవ’ అందాలి'

అనంతపురం: అర్హత ఉన్న ప్రతి రైతుకూ అన్నదాత సుఖీభవ పథకం అందాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులకు సూచించారు. అన్నదాత సుఖీభవ పథకం అమలుపై సోమవారం అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆరు మండలాల తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు, మండల కన్వీనర్లతో సమీక్ష నిర్వహించారు. అర్హత ఉన్న ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదన్నారు.