VIDEO: రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే
WGL: కాంగ్రెస్ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వంలోనే పేదల సొంతింటి కల నిజమవుతుందని స్పష్టంచేశారు. ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించాలంటే సొంత ఇల్లు అవసరమని, ప్రజాప్రభుత్వంలో ఇది నెరవేరుతున్నది అన్నారు.