VIDEO: నగరంలో మరో అగ్నిప్రమాదం
HYD: KPHBలోని పద్మావతి ప్లాజా సెంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్‌లో ఉన్న విలువైన ఫోన్లు అగ్నికి ఆహుతయ్యాయి.