రేపల్లె గిరిజన గురుకులంలో స్పోర్ట్స్ యూనిఫామ్స్ పంపిణీ
BPT: రేపల్లెలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు బుధవారం క్రీడా దుస్తుల పంపిణీ జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని విద్యార్థులకు సూచించారు. క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని తెలిపారు.