VIDEO: బాలుడి చెంప పగులగొట్టిన రోబో
చైనాలో ఓ హ్యూమనాయిడ్ రోబో పొరపాటున బాలుడి చెంప పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. రోడ్డుపై చిత్ర విచిత్రంగా డాన్స్ చేస్తున్న రోబో చేయి బ్యారికేడ్ల అవతల ఉన్న పిల్లాడికి బలంగా తాకింది. దీంతో అతను నొప్పితో విలపించాడు. రోడ్డుపై రోబోలతో ఇలాంటి ప్రదర్శనలు సరికాదని నెటిజన్లు ఫైరవుతున్నారు.