'ఈనెల 30న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం'
MBNR: ఈనెల 30వ తేదీన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాసవి డిగ్రీ కళాశాలలో బంద్‌కు సంబంధించిన వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలన్నారు. అలాగే, బకాయిలు చెల్లించి యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.