'శరవణన్ నాకు కొండంత అండ'.. రజినీ ఎమోషనల్
ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ మృతి పట్ల సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. 'ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఏవీఎం బ్యానర్‌లో నేను 9 సినిమాలు చేశా, అన్నీ బ్లాక్ బస్టర్లే. నా కష్టకాలంలో ఆయన నాకు అండగా నిలిచారు. నాపై ఎంతో నమ్మకం ఉంచారు' అని రజినీ గుర్తుచేసుకున్నారు.