108 అంబులెన్సులో గర్భిణి ప్రసవం
MLG: వెంకటాపూర్ మండలం రామంజపూర్‌కు చెందిన సుమకు పురిటి నొప్పులు రావడంతో రాత్రి 10:45గం.కు సమాచారం అందుకున్న 108 పైలట్ కృష్ణ, ఈఎంటీ మహేష్ గ్రామానికి వెళ్లారు. అంబులెన్సులో ఎక్కించుకొని ములుగు జీజీహెచ్‌కు తరలించే సమయంలో మార్గం మధ్యలోనే మహేశ్ ఆమెకు పురుడుపోయగా, పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ సభ్యులు108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.