జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే మద్దతు

WGL: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల కోసం కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సంఘీభావం ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టుల దీక్షలకు మద్దతు ప్రకటించారు