ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో రేపు నిరసన
CTR: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పుంగనూరులో రేపు నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ఉదయం 10 గంటలకు వైఎస్సార్ విగ్రహం నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.