బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

ADB: ఇచ్చోడ మండలంలోని అడిగామ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కదం సుభాష్ తండ్రికి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలైయ్యాయి. దీంతో చికిత్స పొంది ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివారం వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.