పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన గురుకుల బాలికలు
SRPT: నడిగూడెం బాలికల గురుకుల పాఠశాల బాలికలు మంగళవారం పీఎం శ్రీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టును సందర్శించారు. జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ తయారీ విధానం తెలుసుకున్నారు. విద్యుత్ ఇంజనీర్లు జల విద్యుత్తు గురించి విద్యార్థులకు వివరించారు. పులి చింతల ప్రాజెక్టు చరిత్రను అడిగి తెలుసుకున్నారు.