రోడ్ల మరమ్మతులకు రూ.2.61 కోట్లు మంజూరు

SRPT: నడిగూడెం మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల మరమ్మతులకు రూ.2.61 కోట్ల నిధు లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ శాఖ ఏఈ లావణ్య మంగళవారం సాయంత్రం తెలిపారు. జగన్నాథపురం నుంచి రేపాల వరకు 4.5 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు పునర్నిర్మాణ పనుల కోసం 2 కోట్లు, వెంకట్రాంపురం క్రాస్ రోడ్డు నుంచి వెంకట్రాంపురం వరకు 1.5 కి.మీ వరకు రూ.61 లక్షలు మంజూరై నట్లు ఆమె తెలిపారు.