కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ

కొడంగల్ మున్సిపల్ ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ

VKB: కొడంగల్ మున్సిపాలిటీలోని 12 వార్డులకు జరిగిన ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బుధవారం పోలింగ్ ముగియడంతో, రాజకీయ పార్టీల నాయకులు గెలుపోటములపై లెక్కల్లో మునిగిపోయారు. పోలింగ్ శాతం, తమకు అనుకూలమైన ఓటర్లు ఎంతమేర ఓటు వేశారనే అంశాలపై అభ్యర్థులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం వెలువడనున్న ఫలితాలతో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.