శివాజీ విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ
WGL: రాయపర్తి మండలంలోని ఆరేగూడెం గ్రామానికి చెందిన ఆరె కులస్తులుఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బుధవారం సర్పంచ్ బలకారి యాకయ్య ఆధ్వర్యంలో గ్రామంలో ఘనంగా భూమి పూజ నిర్వహించారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, ఆయన ఆశయాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.