అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
CTR: జీడి నెల్లూరు నియోజకవర్గం, పాలసముద్రం మండలంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న మునికృష్ణ అనే వ్యక్తిని ఎస్సై రాజశేఖర్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా ఖచ్చితమైన సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు, అతని వద్ద నుంచి 30 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.