'మార్జిన్‌ను వెంటనే పెంచాలి'
RR: చికెన్ విక్రయ మార్జిన్‌ను తగ్గించడంతో చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ దుకాణాలను బంద్ చేసి నిరసనకు దిగారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలో షాపులను మూసేసి షాప్ ఓనర్స్ అసోసియేషన్ రోడ్డెక్కారు. భారీగా తగ్గించిన కమిషన్ మార్జిన్‌ను పౌల్ట్రీ కంపెనీలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. కాగా, చికెన్ దుకాణాలు మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.